27.7 C
Hyderabad
April 25, 2024 09: 29 AM
Slider తూర్పుగోదావరి

రీసర్వే కు ముందు గ్రామాలలో ఫీల్డ్ పిఓఎల్ఆర్

#FieldPOLR

రీ సర్వే ప్రారంభించే గ్రామాలలో ముందుగా ఫీల్డ్ పి ఓ ఎల్ ఆర్ ప్రారంభించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లా అధికారులను, తహశీల్దారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు , తహశీల్దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ మన జిల్లాలో మొదటి విడతగా ఈ సర్వే పూర్తి కాబడిన 16 గ్రామాల మినహా మిగిలిన 277 గ్రామాలలో ఫీల్డ్ FO LR కార్యక్రమాన్ని ప్రారంభించాలని , ఈ కార్యక్రమం కొరకు గ్రామస్థాయిలో టీములు ఏర్పాటు చేసి భాగస్వామ్యులను కావాలని కలెక్టర్ సూచించారు. గూగుల్ మ్యాప్ ద్వారా గ్రామ చిత్రపటం ప్రింట్ తీసి దానిలో రైతుల కమతాలు సరిహద్దులు గుర్తించి రీసర్వే ప్రక్రియ ప్రారంభం కాకమునుపే గ్రౌండ్ వ్యాల్యుడేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమం పూర్తయితే రీ సర్వేలో చాలా ఖచ్చితత్వం తో భూములు గుర్తించడంతోపాటు సర్వే కూడా సాఫీగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం 100 రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫీల్డ్ POLR పై గ్రామస్థాయిలో, మండల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి ప్రజలు భాగస్వామ్యం అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ అన్నారు. రీసర్వే చేసిన గ్రామాలలో రెవెన్యూ రికార్డులు అంతా ప్రక్షాళన జరిగి నిజమైన యజమానిని రెవెన్యూ రికార్డుల యందు నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని , భూ సమస్యలు , తగాదాలు ఉండవని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు జె వి మురళి, ఇంచార్జి డిఆర్ఓ దాసి రాజు, డి పివో యం. నాగలత , డి యల్ డి ఓ కె సి హె అప్పారావు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా

Satyam NEWS

అయోధ్యలో రామ విగ్రహ స్థాపన రోజు ఇంట్లో దీపాలు వెలిగించాలి

Satyam NEWS

ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఉద్యమాలే – సీఐటీయూ

Bhavani

Leave a Comment