విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీఅమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. త్రిమూర్తులకన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. ఈ దేవియే శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో, భక్తిపావనాన్ని చిందే చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శనమిస్తుంది. శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తూన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెడుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి రద్దీగా మారింది భక్తులు కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు
previous post