33.2 C
Hyderabad
April 25, 2024 23: 29 PM
Slider నల్గొండ

సామాజిక న్యాయం కోసం పోరాడుదాం

#NFIW

స్త్రీ పురుష సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రపంచ శాంతి కోసం మహిళలు పోరాడాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి అన్నారు. NFIW ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని హుజూర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

అనేక సంవత్సరాలుగా స్త్రీ సమన్యాయం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. స్త్రీలు పని చేసే చోట ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక అవమానాలకు గురి అవుతున్నారని ఆవేదనను వ్యక్తపరిచారు.

ఇలాంటి వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలు ప్రభుత్వాలు మారుస్తున్నాయని విమర్శించారు. మహిళలు అనేక రంగాలలో ముందుకు పోతున్న సందర్భంలో  అనేక అవమానాలకు గురి కావాల్సి వస్తుందని, మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పట్టణ సినియర్ మహిళా నాయకురాలు పశ్య పిచ్చమ్మ NFIW జెండాను ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో యల్లావుల ఉమ, దేవరం సుజాత, చెన్నగాని స్రవంతి, రామ నర్సమ్మ, నాగమణి, కళమ్మ, మంగమ్మ శ్రీలత, అనూష తదితరులు పాల్గొన్నారు.

Related posts

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

Bhavani

మాజీ ఐఏఎస్ ఉమాపతి రావు అంత్యక్రియలు పూర్తి

Satyam NEWS

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గేంచేంతవరకు జనసేన పోరాటం ఆపదు

Satyam NEWS

Leave a Comment