25.7 C
Hyderabad
June 22, 2024 06: 26 AM
Slider నల్గొండ

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలింద్దాం: శీతల రోషపతి

#roshapati

కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి కొనసాగిద్దామని,ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో మోడీ గో బ్యాక్, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి,రైతు చట్టాలను రద్దు చేయాలి,కార్మిక చట్టాలు సవరణ నిలుపుదల చేయాలని,బిజెపి  మతతత్వ విధానాలను మానుకోవాలని  ప్రదర్శన నిర్వహించారు.అనంతరం చలో సూర్యాపేట కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో 1942 ఆగస్టు 9 చరిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకుందని, దేశవ్యాప్తంగా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం కార్మికులు,రైతులు,ప్రజలు తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం తెచ్చుకుంటే నేటి ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోగ ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను బడా పెట్టుబడిదారులకు చౌకగా ధారాదత్తం చేస్తూ కార్మికులని, రైతులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.

ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి,సమరశీల పోరాటాలు సాగించిన ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం అనంతరం కూడా తమ శ్రమతో సంపదను సృష్టిస్తున్న రైతులు,కార్మికులు,ఇతర శ్రమ జీవులకు కష్టానికి తగిన ఫలితం దక్కటం లేదని అన్నారు.

మూడు దశాబ్దాల సరళీకరణ విధానాలు భారతదేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం,ఉపాధి కోసం వలసలు,పౌష్టిక ఆహార లోపం,ఆకలిచావులు,ఆత్మహత్యలు నేడు దేశాన్ని చుట్టుముట్టి సంక్షోభ సుడిగుండంలోకి నెట్టాయని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాడుతున్న ప్రజలు,మేధావులు, ఉద్యమకారులపై తీవ్రమైన అణచివేత నిర్బంధం కొనసాగుతుందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ప్రతిఘటన పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు రైతు,వ్యవసాయ, కార్మిక సంఘాల అఖిలభారత కమిటీలు పిలుపునిచ్చాయని అన్నారు.

గడిచిన ఎనిమిది నెలలుగా జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని చీల్చేందుకు బిజెపి వేసిన పాచికలు పారలేదని,కార్మిక వర్గం,రైతాంగం వ్యవసాయ,కార్మికులు మరింత దృఢంగా పోరాడుతున్నారని అన్నారు.రైతు,కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,విద్యుత్ చట్ట సవరణ ఆపాలని,ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,కోల్పోతున్న ఉపాధిని రక్షిస్తూ జీవన ఉపాధి పెంచేందుకు చర్యలు గైకొనాలని,రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి కనీస మద్దతు ధర చట్టం చేయాలని,ఋణ విమోచన చట్టం తేవాలని అన్నారు.

ఉపాధి హామీకి బడ్జెట్ ను పెంచి 200 రోజుల పనికి రోజుకు 600 వందల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీజిల్,పెట్రోల్,వంట గ్యాస్,ఇతర నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని అన్నారు. కార్పొరేట్ లను ప్రతిఘటిద్దాం, భారత్ ను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ఆపాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, శిల్పకళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు ఉపతల వెంకన్న, మండల అధ్యక్షుడు గోవిందు,ముస్తఫా, వేణు,రాకేష్,రాజు,దుర్గారావు,శ్రీను, పిల్లలమర్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సీఎంఆర్ వేగంగా చేస్తాం మిల్లింగ్ రాష్ట్రంలోనే చేయండి

Satyam NEWS

చంద్రయాన్ – 3 ముహూర్తం ఖరారు

Satyam NEWS

ఆర్టీసీ ఎమ్.డి ద్వారా వనపర్తి డిపోకు అవార్డులు

Satyam NEWS

Leave a Comment