39.2 C
Hyderabad
April 23, 2024 15: 31 PM
Slider ప్రత్యేకం

నాకు కరోనా సోకింది…నేను దానితో పోరాడుతున్నాను

#Fighting Coronavirus New

‘‘నాకు కరోనా సోకిన లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో నేను కరోనా టెస్టు చేయించుకున్నాను. నేను అనుకున్నట్లుగానే కరోనా పాజిటీవ్ వచ్చింది. నేను మాస్క్ వాడాను. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాను. అంతే కాదు తరచూ నా చేతులను శుభ్రపరచుకున్నాను. అయినా కరోనా నా శరీరంలోకి ప్రవేశించింది.

ఓ కరోనా ఇప్పుడు నాలోకి ప్రవేశించావు కదా? నేను నీకు చెప్పే బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నా నుంచి మరొకరికి నిన్ను సోకనివ్వను. నా శరీరంలో ఉన్న నీకు నాతో పోరాడటం తప్ప వేరే మార్గం లేకుండా చేస్తా. నాతో పోరాడి నా శరీరంలోనే నువ్వు చచ్చిపోవాలి. నా శరీరంలోని రోగనిరోధక శక్తి నీపై దాడి చేయడం ప్రారంభించేలా చేస్తా.

ఇప్పటి నుంచి నేను తీసుకునే ప్రతి ఆహారం, ద్రావకం, మందు అన్నీ నీపై పోరాటం చేసేవే. నా రోగ నిరోధక శక్తికి మరింత పదును పెట్టేందుకు నేను ప్రతి ప్రయత్నం చేస్తుంటాను. ఆక్సిజన్ పల్సో మీటర్, ధర్మామీటర్ తో నీవు ఎలా ఉన్నావు, నా శరీరంలో ఏం చేయస్తున్నావో కనుక్కుంటాను.

నా డాక్టర్లు కూడా నిన్ను అనుక్షణం కనిపెట్టి ఉండే విధంగా నేను వారిని సమాచారం ఇస్తుంటాను. నేను నీతో జరిపే పోరాటంలో కచ్చితంగా గెలుస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను ముందుగానే సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాను. నా నుంచి కరోనా పూర్తిగా వెళ్లిపోయే వరకూ లేదా మరో 14 రోజులు నేను ఐసోలేషన్ లోనే ఉంటాను.

నా నుంచి కరోనా పూర్తిగా దూరం అయిన తర్వాత నేను నా ప్లాస్మా ను వేరేవారికి దానం చేసేందుకు సిద్ధంగా ఉంటాను. మరొకరికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.’’

(కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఇది చదువుకోండి. దీన్నే పాటించండి. ధైర్యంగా ఉండండి. మీకు ఏమీ కాదు. కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదు కచ్చితంగా. ఇది మనసులో పెట్టుకుంటే మిమ్మల్ని కరోనా ఏమీ చేయలేదు.)

-బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో, హైదరాబాద్ Email: director@bmrb.in

Related posts

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మునిసిపల్ కమిషనర్

Satyam NEWS

జగన్ ప్రభుత్వం.. మైనార్టీ లకు ఏం చేసింది..?

Bhavani

టీటీడీ ఎస్వీబీసీ సలహదారుగా జర్నలిస్టు దుర్గ

Bhavani

Leave a Comment