35.2 C
Hyderabad
April 24, 2024 11: 47 AM
Slider నల్గొండ

టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఆంగ్ల విద్య ఎంత వరకు సాధ్యం

#congressparty

ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని  టి.పి.సి.సి రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఆంగ్ల విద్యను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా గురువారం నాడు హుజూర్ నగర్ లోని బూత్ నెంబర్ 218 లో బూత్ ఎన్ రోల్ మెంట్ కార్యక్రమం జరిగింది.

దీనికి షేక్ నజీర్ అహ్మద్ బాధ్యత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి.పి.సి.సి రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకరరెడ్డి సభ్యత నమోదు స్వీకరించిన సందర్భంగా ఎండీ.అజీజ్ పాషా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ కార్యక్రమంలో ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు.

డిజిటల్ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల భీమా సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని పాషా అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మభ్యపెడుతున్నారని, ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారని అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుండి వితంతు పెన్షన్లు, నిరుద్యోగ భృతి,రైతు రుణమాఫీలు, డబుల్ బెడ్రూం ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతి ఒక్కరూ అంటున్నారని పాషా ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సభ్యులు అనుబంధ సంఘాల వారు పార్టీ డిజిటల్  సభ్యత్వంలో భాగస్వాములు కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,ఎలక సైదులు గౌడ్, హనుమంతు, గుండు నరేష్, అశోక్,వీరయ్య,వనపర్తి శివ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను తరిమికొట్టగలం

Satyam NEWS

పూణే లో ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమావేశం

Satyam NEWS

కార్మిక చట్టాల సవరణను తక్షణమే విరమించుకోవాలి

Satyam NEWS

Leave a Comment