30.7 C
Hyderabad
April 19, 2024 10: 40 AM
Slider ప్రపంచం

Final Decision: డోనాల్డ్ ట్రంప్ కు సుప్రీంకోర్టులో మొట్టికాయ

#DonalTrump

అమెరికా అధ్యక్షుడుగా దిగిపోతున్న డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న చివరి ప్రయత్నం ఘోరంగా విఫలం అయింది. జరిగిన ఎన్నికలను రద్దు చేయాలంటూ టెక్సాస్ రాష్ట్రం వేసిన పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. డోనాల్డ్ ట్రంప్ వెనక ఉండి టెక్సాస్ రాష్ట్రంలో పిటిషన్ వేయించారు.

ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. జోబైడెన్ ఎన్నిక చెల్లదంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెక్సాస్ తో బాటు మిచిగావ్, జార్జియా, పెన్సిన్వేలియా, విస్కాన్ సిన్ రాష్ట్రాలలో జరిగిన పోలింగ్ ను రద్దు చేయాలని టెక్సాస్ కోరింది.

అసలు టెక్సస్ రాష్ట్రానికి ఇలా కోరే న్యాయపరమైన అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేరే రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని ఒక రాష్ట్రం ఎలా కోరుతుందని అమెరికా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

జస్టిస్ శామ్యూల్ అల్టియో, జస్టిస్ క్లారెన్స్ థామస్ లు తుది తీర్పు చెబుతూ టెక్సాస్ రాష్ట్రం కోరిన ఏ అంశాన్నీ తాము పరిశీలించలేమని స్పష్టం చేశారు.  

Related posts

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS

1010 ఉద్యోగాల భర్తీకి  సీఎం గ్రీన్ సిగ్నల్

Murali Krishna

బ్రెజిల్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

Sub Editor

1 comment

N Rao Madas December 13, 2020 at 7:06 AM

Appreciate, be Connected pl.

Regards,
Ln Er M N RAO (R)
Sr Consultant & Freelancer. Corporate / Overseas Coordinator – Media Observer.
C : +91 99898 35625, 939898 5269.
e: madasnrao@gmail.com

Reply

Leave a Comment