27.7 C
Hyderabad
March 29, 2024 05: 04 AM
Slider ప్రత్యేకం

నిరుద్యోగులకు శుభవార్త: ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీసు ఖాళీల భర్తీకి అనుమతి

#Telangana CM KCR

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు  శుభవార్త తెలిపింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల  భర్తీకి  ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది.

శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీకి  అనుమతిస్తూ  ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది.  ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు  ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖ ల్లోని 3334 ఖాళీల భర్తీకి  ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని   ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.

Related posts

29 నుంచి వచ్చేనెల 2 వరకు రొట్టెల పండుగ

Bhavani

సంబురం

Satyam NEWS

బి‌జే‌పి, బి‌ఆర్‌ఎస్ మధ్య పోలిటికల్ వార్

Murali Krishna

Leave a Comment