36.2 C
Hyderabad
April 24, 2024 22: 10 PM
Slider జాతీయం

సామాన్యుడి కోసం తప్ప స్నేహితుల కోసం కాదు

#NirmalaSeetaraman

దేశంలోని సామాన్యుడి కోసమే తాము పని చేస్తాము తప్ప స్నేహితుల కోసమో, బినామీల కోసమో కాదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఈ దిశగానే ఉందని ఆమె నేడు లోక్ సభలో తెలిపారు.

బడ్జెట్ పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కరోనా మహమ్మారి కూడా దేశాన్ని భయపెట్టలేకపోయిందని, తాము సంస్కరణలు చేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని ఆమె అన్నారు. ప్రపంచ దేశాలలో అగ్రభాగాన నిలబడేందుకు భారత్ పోటీ పడుతున్నదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

తాము సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవడం వల్లనే ఇది సాధ్యం అవుతున్నదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయం కోసం కేటాయింపులు తక్కువ చేశామనే ఆరోపణలకు సమాధానమిస్తూ తాము బడ్జెట్ కేటాయింపులు తగ్గించలేదని, హేతుబద్ధం చేశామని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ నుంచి తాము అడిగిన వివరాలు రానందున అక్కడి 65 లక్షల మంది రైతులకు తాము మేలు చేయలేకపోయామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందువల్ల ప్రధాన మంత్రి కిసాన్ యోజనలో వారికి ఇవ్వాల్సిన మొత్తం చేర్చలేకపోవడం వల్ల కూడా వ్యవసాయ బడ్జెట్ తగ్గినట్లుగా కనిపిస్తున్నదని ఆమె వెల్లడించారు.

వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాల కల్పనకు, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు, అన్ని రంగాలకు చెందిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు.

ఆరోగ్య బడ్జెట్ లో 9.67 శాతం పెరుగుదల కనిపించిందని ఇది సామాన్యుడికి మేలు చేస్తుందని ఆమె వెల్లడించారు. గ్రామీణ ఉపాధి గ్యారెంటీ పథకం కోసం రూ.73,000 కోట్ల రూపాయలు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ప్రతి విషయంపైనా తప్పుడు సమాచారం అందిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశ  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు.

Related posts

ఏపిలో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర

Satyam NEWS

మహాదేవ్ యాప్ కార్యాలయంలలో ఈడి సోదాలు

Bhavani

ధర్మయుద్దం ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన ముదిరాజులు

Satyam NEWS

Leave a Comment