27.7 C
Hyderabad
March 29, 2024 02: 17 AM
Slider విజయనగరం

ఎదురు కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

#SP Rajakumari

విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన రౌతు జగదీన్ సీఆర్ పీ ఎఫ్ కాని స్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఏప్రిల్ 3న చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సంగతి విదితమే.

మృతి చెందిన జగదీష్ కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలిచేందుకు విజయనగరం జిల్లా నుండి సీఆర్ పీ ఎఫ్ లో పని చేస్తున్న సుమారు 400మంది సిబ్బంది, అధికారులు ఒక బృందంగా ఏర్పడి, సమీకరించుకున్న  2 లక్షల 15,వేల చెక్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన రౌతు జగదీస్ సీఆర్ పీ ఎఫ్ కాని స్టేబుల్ గా చత్తీస్ ఘడ్ లో 210 కోబ్రా బెటాలియన్ లో విధులు నిర్వహిస్తూ, ఏప్రిల్ 3న మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు.

మరణించిన రౌతు జగదీస్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు జిల్లా నుండి సీఆర్ పీఎఫ్ లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ముందుకు రావడం, వారిలో ఐక్యతను తెలుపుతుందన్నారు.

సమీకరించిన మొత్తం జగదీష్ కుటుంబానికి ఆర్ధికంగా ఉపయోగ పడుతుందని, బిడ్డను కోల్పోయిన కుటుంబానికి సీఆర్ పీ ఎఫ్ సిబ్బంది, అధికారులు అండగా నిలవడం ఒక శుభపరిణామ మన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంకు వచ్చిన సీఆర్ పీఎఫ్ అధికారులు, సిబ్బంది సమక్షంలో మృతి చెందిన రౌతు జగదీష్ తల్లిదండ్రులు సింహాచలం, రమణమ్మలకు జిల్లా ఎస్పీ రాజకుమారి అందజేసారు.

ఈ కార్యక్రమంలో సీఆర్ పీఎఫ్ రిటైర్డ్ డిఫ్యూటీ కమాండెంట్ కె.జి.రావు, సీఆర్ ఎఫ్ హెడ్ కాని స్టేబుల్ఎం .శ్రీరాంమూర్తి, కానిస్టేబుళ్ళు ఎస్.సంతోష్ కుమార్, సిఆర్ ఫిఎఫ్ ఐజీ కార్యాలయంలో పని చేస్తున్న సురేష్, పి.వినోద్ కుమార్, పి.వెంకటరావు మరియు రౌతు జగదీష్ తల్లిదండ్రులు రౌతు సింహాచలం, రమణమ్మ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

చాక్ పీస్

Satyam NEWS

ఆదిలాబాద్ డి సి సి బి చైర్మన్ గా దళిత నేత

Satyam NEWS

తెరుచుకున్న శబరిమల ఆలయం

Satyam NEWS

Leave a Comment