28.7 C
Hyderabad
April 20, 2024 07: 36 AM
Slider తూర్పుగోదావరి

చేయూత కాదు.. చేతివాటంలా మారిన పథకం

#reddy anantakumari

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నామంటూ మహిళల సంక్షేమం లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని అమలాపురం తేదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి విమర్శించారు. కొత్తపేటలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.3వేల చొప్పున ప్రతి నెలా పెన్షన్ ఇస్తానన్నారు.

అధికారంలోకి వచ్చాక పెన్షన్ కాదు.. ఐదేళ్లకూ కలిపి ఆర్ధిక సాయం అందిస్తామంటూ మాటమార్చారన్నారు. ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చి మహిళా లోకాన్ని నిండా ముంచారన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి మహిళకు నెలకు రూ.3వేల పెన్షన్ అనుకున్నా ఏడాదికి రూ.36వేలు, ఐదేళ్లలో రూ.1.80లక్షలు ఇవ్వాలి. కానీ ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మడమ తిప్పడంతో ఒక్కో మహిళకు రూ.1.05 లక్షల చొప్పున ఎగనామం పెట్టారన్నారు.

ఈ పథకాల్లో మార్పులు చూస్తే చేయూత కాదు జగన్ రెడ్డి.. ముమ్మాటికీ నీ చేతివాటమే అనిపిస్తుందని విమర్శించారు.45 ఏళ్లు పైబడిన వారు 23 లక్షల మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఆధార్ ఇండియా 31, మే 2020 సమాచారం ప్రకారం రాష్ట్ర జనాభా 5.39 కోట్లు. 5 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో 45-60 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు సగటున కోటివరకు ఉంటారనేది సామాన్యులెవరైనా అంచనా వేయగలరు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పసుపు-కుంకుమ పథకాన్ని 93లక్షల మంది అక్క చెల్లెల్లకు అందిస్తే జగన్ రెడ్డి 23 లక్షల మందికి కుదించడం మోసం చేయడం కాదా అన్నారు. ఆ లెక్కన చూసుకున్నా  దాదాపు 70లక్షల మందిని మోసం చేయడమేన్నారు. జగన్ రెడ్డికి ధైర్యముంటే చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను పంచాయతీల వారీగా అందించాలి.

అప్పుడు మీ సంక్షేమమేంటో ప్రజలకు తెలుస్తుంది.మరోవైపు వైసీపీకి ఓటు వేసిన వారికే పథకం అందుతుందని, లేదా ఇకపై అయినా వైసీపీ కోసం పని చేయాలని వాలంటీర్లు మహిళలను వేధిస్తున్నారు.కుల ధ్రువీకరణ పత్రాల పేరుతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కరోనా సమయంలోనూ ఇబ్బంది పెట్టడంతో మీ సేవా సెంటర్ల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ప్రతి ఏటా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని నిబంధన విధించడం మహిళల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటన్నారు. జగన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మహిళా లోకానికి అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చింది మొదలు.. పథకాల అమలులో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు.గొర్రెలు, మేకలు ఆవులు అందించి.. ఆ పాలను అమూల్ కు మాత్రమే పోయాలనడం,గొర్రెలు, మేకల మాంసాన్ని పలానా గ్రూపు వారికి మాత్రమే ఇవ్వాలనడం ద్రోహం కాదా.?

అమూల్ సంస్థ నుండి వచ్చే కమిషన్ల కోసం రాష్ట్రంలోని పాడి వ్యవస్థను నాశనం చేస్తున్నారు. చేయూత పేరుతో సొమ్ము అందిస్తున్నాం.. వ్యాపారాలు చేసుకోవాలని చెబుతూ.. జగన్ రెడ్డి కమిషన్లు దండుకోవడానికి సిగ్గుపడాలన్నారు. వాలంటీర్ల వేధింపుల గురించి, వైసీపీ నేతల కమిషన్ల దందా గురించి మాట్లాడే ధైర్యముందా.?

చేయూత పేరుతో హడావుడి చేస్తూ.. మహిళలకు అందించే సాయంలోనూ చేతివాటం చూపడం జగన్ రెడ్డి లాంటి అవినీతి తిమింగళానికే సాధ్యమని నిరూపించారు. ప్రజలు ఈ విషయాలన్నీ గ్రహిస్తున్నారని త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు.

Related posts

వైభవంగా శ్రీ కనక దుర్గా అమ్మవారికి జ్యోతుల సమర్పణ

Satyam NEWS

జీవన విధానంలో స్వచ్ఛత మౌలిక సూత్రం

Bhavani

ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా కొట్టిన భర్త

Satyam NEWS

Leave a Comment