40.2 C
Hyderabad
April 24, 2024 18: 11 PM
Slider హైదరాబాద్

దాతల చేయూత కోసం తలసేమియా చిన్నారి ఎదురు చూపు

#thalassemia

నిరుపేద గిరిజన కుటుంబానికి ఆ చిన్నారికి తలసేమియా వ్యాధి సోకింది.. ప్రాణ గండంతో ఉన్న ఆ చిన్నారి దాతల చేయూత కోసం ఎదురు చూస్తుంది… రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరి గూడ మండలంలోని గాలిగుడ గ్రామ పరిధిలోని  ధర్మ్య నాయక్ తాండకు చెందిన చందు నాయక్ లక్ష్మీల దంపతులకు 6 ఏళ్ల వయస్సు ఉన్న సంధ్య రాణి అనే కూతురు ఉంది.

వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు భర్త చందు మేస్త్రి చేతికి కింద కూలీ పనులకు వెళ్తాడు. వీరికి చిన్నపాటి పెంకుటిల్లు తప్ప మరే ఆస్తి లేదు. వైద్యుల సూచన మేరకు ఆరెళ్ల చిన్నారికి ఇప్పటి వరకు 90 సార్లు రక్తం ఎక్కించారు. వైద్యం చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారాయి. మేస్త్రిల చేతికింద కూలీ పనులు చేస్తున్న చందు నాయక్ కు రోజు 300వరకు సంపాదిస్తున్నాడు. 

వచ్చిన డబ్బులు జమ చేసి నెలకు రెండు సార్లు హైదరాబాద్ వెళ్లి చిన్నారికి వైద్యం చేయిస్తున్నాడు. నెలకు వైద్యం కోసం కనీసం 15 వేల వరకు ఖర్చు అవుతుందని తండ్రి తెలిపాడు. కుటుంబ పోషణ, కూతురు వైద్యం భారంగా మారిందని తల్లిదండ్రులు రోదిస్తూ చెబుతున్నారు.

ఆపరేషన్ కోసం 15లక్షల ఖర్చు

చిన్నారికి ఆపరేషన్ కోసం 15లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని తండ్రి తెలిపాడు. శాశ్వత పరిష్కారం కోసం బెంగళూరు వెళ్లి ఆసుపత్రి లో ఆపరేషన్ చేయించాలని వైద్యలు సూచించినట్లు, ఇన్ని డబ్బులు తమవద్ద లేవని దాతలు సహకరించాలని తండ్రి చందు నాయక్ వేడుకుంటున్నారు.

సహాయం చెయ్యదలుచుకునే వారు 9705993729 బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబరు 31711206346  ifsc sbi no 000697 ద్వారా సహాయం  చేసి పాప ఆపరేషన్ కు సహకరించాలని కోరుతున్నారు.

Related posts

విశ్వ జనీనం

Satyam NEWS

గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ ను కలసిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు

Satyam NEWS

రోటారాక్ట్ – రోటరీ ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు బట్టల పంపిణీ

Satyam NEWS

Leave a Comment