27.7 C
Hyderabad
April 24, 2024 10: 15 AM
Slider విజయనగరం

కోవిడ్ నియంత్రణలో అమరులైన పోలీసు కుటుంబాలకు 3లక్షల ఆర్ధిక సహాయం

#vijayanagarampolice

ఏపీ రాష్ట్ర డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్, ఇతర రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సుకు విజయనగరం జిల్లా నుండి పార్వతీపురం ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు, డీపీఒ ఎ.ఒ. వెంకట రమణ, ఆర్.ఐ పి.నాగేశ్వరరావు, పోలీసు అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ 19 వైరస్ నియంత్రణ లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వహించి, ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది, అధికారుల కుటుంబాలకు మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ అండగా నిలవడం, వారికి ఆర్ధికంగా సహాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, కరోనాబారిన పడి మృతి చెందిన సిసిఎస్ డీఎస్పీ జె.పాపారావు ,కొటియా ఎస్ఇ ఎం. పరంజ్యోతి , తెర్లాం ఎఎస్ఐ డి.వి.కృష్ణారావు, సిసిఎస్ ఎఎస్ఐ ఎస్.రమణ ,ఎఆర్ హెచ్ సి ప్రసాద్ ,ట్రాఫిక్ విఎస్ పీసీ బి.చంద్రశేఖర్ రావు,ఎఆర్ హెచ్ సి కె.విశ్వయ్యల కుటుంబాల సభ్యులకు ఒఎస్డి ఎన్.సూర్యచంద్రరావు మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీ వితరణగా అందజేసిన 3లక్షల చెక్కులను అందజేసారు.

కరోనా విధులలో అమరుడైన ట్రాఫిక్ పీసీ బి.చంద్రశేఖర్ రావు కుమార్తె మౌక్తిక వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తో మట్లాడుతూ తాను బీబీఎ డిగ్రీ చదువుతున్నానని, తన సోదరి డిగ్రి పూర్తి చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ ద్వారా ఇచ్చిన ఆర్ధిక సహాయం వలన తమ చదువులకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని తెలిపారు.

పోలీసు సంక్షేమంలో భాగంగా వచ్చిన ఆర్ధిక సహాయం వలన తమ కుటుంబానికి అండగా ఉందన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పోలీసు వ్యవస్థనుండి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. కరోనా బాధిత పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామన్న భరోసాను బాధిత కుటుంబాలకు ఒఎస్డి ఎన్. సూర్యచంద్రరావు కల్పించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డీపీఒ ఎఒ వెంకటరమణ, ఆర్ఐ పి.నాగేశ్వరరావు, పోలీసు అసోసియేషను సభ్యులు కె.శ్రీనివాసరావు, పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.

Related posts

బ్రాహ్మణ నిరుద్యోగులకు హైదరాబాద్ లో ఉచిత భోజన వసతి

Satyam NEWS

నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

Satyam NEWS

జిల్లా స్థాయి ఖోఖోలో ఐగ్రో విద్యార్ధుల ప్రతిభ

Satyam NEWS

Leave a Comment