దారి తప్పుతున్న వ్యవస్థపై సోషల్ మీడియా నిత్యం మొట్టికాయ లు వేస్తుండంతో సమాజం లో కొంతైనా మార్పు కనపడుతుంది. ముఖ్యం గా అధికారులు పక్క దారి పట్టినప్పుడు సోషల్ మీడియా కు మించిన ప్రసార మద్యమే లేదు. అలాంటి దే ఈ సంఘటన. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డ పోలీస్ వాహనానికి తప్పని పరిస్థితిలో జరిమానా విధించారు.
బుధవారం టీఎస్09 పీఏ 4083 హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన పోలీస్ వాహనం ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో అపసవ్య మార్గంలో దూసుకొచ్చింది. దానిని ఓ సామాన్యుడు ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు.
ఆ ఫొటో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఎట్టకేలకు విషయం రాచకొండ కమిషనరేట్‌కు చేరింది. దాంతో తప్పని పరిస్థితిలో పోలీసు వాహనానికి రూ.1135 జరిమానా విధించారు. జరిమానా విధించిన ఫొటో సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.