24.7 C
Hyderabad
February 10, 2025 22: 47 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 1 నుంచి ఏపిలో నాణ్యమైన బియ్యం

y s jagan america

వచ్చే ఏడాది ఏఫ్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం వైఎస్‌ జగన్ ఆదేశాలు జారీ చేశారు. నేడు పౌరసరఫరాల శాఖ పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీ పై ఆరాతీశారు. ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం ఆదేశించారు.  రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు ఆదేశించారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts

వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు

Satyam NEWS

ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేని బ‌డ్జెట్ ఇది

Satyam NEWS

రుణ మాఫీ పథకం అమలు తెలంగాణలో కేవలం ఐదు శాతమే

Satyam NEWS

Leave a Comment