30.2 C
Hyderabad
February 9, 2025 20: 04 PM
Slider జాతీయం

మళ్లీ ఫైర్: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 9మంది మృతి

delhi fire accedent

ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్‌లో జరిగింది.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో ఈ వస్త్ర గోడౌన్‌ మొదటి అంతస్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12. 30 సమయంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళులు ఉన్నారు.

Related posts

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్

mamatha

“రామ్ సేతు”లో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

mamatha

లాక్ డౌన్ బాధితుల ఆకలి తీరుస్తున్నఎన్టీఆర్ అభిమానులు

Satyam NEWS

Leave a Comment