Slider కృష్ణ

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

మంత్రి బొత్స సత్యనారాయణ తాచుపాము

Satyam NEWS

సహకరించని టీడీపీ

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!