27.2 C
Hyderabad
September 21, 2023 21: 47 PM
Slider సినిమా

హరిహర వీరమల్లు సెట్ లో అగ్ని ప్రమాదం

#fire accident

పవర్ స్టార్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని దుండిగల్ పరిధిలోని బౌరంపెట్‌లో అర్ధరాత్రి షూటింగ్ జరుగుతుండగా మంటలు

అలుముకున్నాయి. అది గమనించిన చిత్ర యూనిట్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. గతంలో వర్షానికి సెట్ కూలగా.. ఇప్పుడు దానికి మరమత్తులు చేసే క్రమంలోనే

ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగలేదని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related posts

మేడారం తల్లులను సందర్శించుకున్న గండ్ర సత్తెన్న

Satyam NEWS

ముస్లింలకు అనుకూలంగా మాట్లాడినా స్వర్గం దక్కదు

Satyam NEWS

షబ్బీర్ అలిని గెలిపించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!