32.7 C
Hyderabad
March 29, 2024 11: 44 AM
Slider

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

#KarimnagarFire

కరీంనగర్ లోని NPDCL ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్టోర్‌లో ఉన్న పలు ట్రాన్స్‌ఫార్మర్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మార్‌లు అగ్నికి ఆహుతయ్యాయి.

అగ్నిప్రమాదానికి కల కారణాలు ఇంకా సరిగా తెలియకపోయినప్పటికీ షార్ట్ సర్క్యూట్ తోటే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీశారు.

ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు ట్రాన్స్‌ఫార్మర్లు మంటల్లో కాలిపోయాయి.

Related posts

ధరలు స్థిరంగా ఉండి, రానున్న సంవత్సర కాలమంతా సుఖం

Satyam NEWS

దళిత మహిళపై దాడి: స్పందించని పోలీసులు

Satyam NEWS

30న ఏలూరులో బిజిలి మహోత్సవం

Satyam NEWS

Leave a Comment