39.2 C
Hyderabad
April 25, 2024 15: 27 PM
Slider విజయనగరం

ఓ వైపు ఈదురు గాలులు.. మరో వైపు అగ్ని ప్రమాదం…!

#merakamudidam

విజయనగరం జిల్లా మెరకముడిదాంకు హుటాహుటిన జేడ్పీ చైర్మన్…!

ఈ వారంలో రెండో సారి….ఈదురుగాలులు… వర్ష భీభత్సం. విజయనగరం జిల్లా లో పరిస్థితి ఇది.తాజాగా.. ఈ సాయంత్రం…. జిల్లా వ్యాప్తంగా ఒక్క సారి గా ఈదురు గాలులు… ఆ పై ఆకాశం కారు మబ్బులు కమ్మి…ఆకస్మాత్తుగా వర్షం మొదలైంది. జిల్లా లో అన్ని మండలాల్లో ఆకస్మికంగా వర్షం కురవగా..మెరకముడిదాం మండలం లో..వీచిన ఈదురు గాలులకు అగ్ని తోడవడంతో… మండలంలోని పూతికవలసలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న… వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.. క్షణం ఆలస్యం చేయకుండా… వెనువెంటనే ఘటనా స్థలికి వెళ్లారు.

అగ్ని ప్రమాదం జరిగిన పూతికవలస గ్రామాన్ని సందర్శించారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు… జేడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు. మెరకముడిదాం  మండలంలో చిన్నపూతికవలస లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిల్లు దగ్ధమయ్యాయి.   అక్కడే ఉన్న ఇంచార్జి తహసీల్దారు గిరిధర్ తో అగ్నిప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు….జేడ్పీ చైర్మన్. అలాగే గృహనిర్మాణ శాఖాధికారి రమణమూర్తి తో కూడా ఫోన్ లో మాట్లాడారు. అగ్నిప్రమాద బాధితులకు వెంటనే ఇళ్లను మంజూరు చెయడం తో పాటు వెంటనే ఇల్లు నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లను చేయాలనీ ఆదేశించారు…వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.

Related posts

అట్రాసిటి బాధితులకు వెంటనే సహాయం

Satyam NEWS

ప్రధాన డిమాండ్ వదిలేశారుగా చర్చలు జరపండి

Satyam NEWS

RDO కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment