ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటికి 35 మంది మరణించారు. రాణీ ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌మండిలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో మరో 56 మంది వరకూ గాయపడ్డారు.
ప్లాస్టిక్ తయారీ భవనంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ దారుణం జరిగింది. విపరీతమైన పొగ, మంటలతో ఊపిరాడక 35మంది చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాదం జరిగిన భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేస్తున్నారు.
దీంతో ప్లాస్టిక్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ ప్లాస్టిక్ కాలిన వాసనకే అనేకమంది ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేస్తున్నాయి. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.