పసిపిల్లలకు చికిత్స అందించే ఇక్యుబేటర్ గదిలో అకస్మాత్తుగా అగ్రి ప్రమాదం జరగడంతో ఒక చిన్నారి మరణించింది. ఈ దారుణమైన సంఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలోని షైన్ పిల్లల వైద్యశాలలో జరిగింది. ప్రమాద సమయంలో 42 మంది పిల్లలు చికిత్స పొందుతూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా దూపాడు గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు ఈ ప్రమాదంలో మరణించగా ఐదుగురు పసిపిల్లలు చావుబతుకుల్లో ఉన్నట్లు తెలిసింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే గ్యాస్ సిలెండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ వార్డు వరకూ భారీ ఎత్తున మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అగ్నిప్రమాదానికి ఒక చిన్నారి బలి అయ్యాడు. హాస్పిటల్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అధికారులు రంగంలోకి దిగారు. హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేసి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు కానీ లేకపోతే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.
previous post