28.2 C
Hyderabad
April 30, 2025 05: 23 AM
Slider నిజామాబాద్

నిజామాబాద్‌లో సెల్‌ టవర్‌ నుంచి మంటలు

cell tower

నిజామాబాద్ పట్టణంలో ఒక భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌లో మంటలు చెలరేగాయి. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్‌ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్‌ వేశారు. అయితే  షార్ట్ సర్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్‌టవర్‌ కోసం ఏర్పాటు చేసిన గదిలోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది.

దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా సెల్‌ టవర్‌ అంటుకోవడంతో ఇంటి యజమానితో పాటు, ఆ భవనంలో అద్దెకు ఉంటున్నవారు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సెల్‌ టవర్‌ అంటుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌ను తొలగించాలంటూ స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

Related posts

మద్యం దొరికింది..తాగాడు..భార్యను కొట్టాడు..చనిపోయాడు

Satyam NEWS

ఆపద కాలంలో అండగా నిలిచిన బాల్య మిత్రులు

Satyam NEWS

అభయాంజనేయ ఆలయనిర్మాణానికి ప్రతిష్టాపన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!