28.7 C
Hyderabad
April 20, 2024 07: 13 AM
Slider నల్గొండ

చెప్పిన పంటలు సాగు చేయకపోతే రైతుబంధు ఇవ్వరా?

#Raytu Sangaham

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేయకపోతే రైతుబంధు ఇవ్వమని పంటలకు మద్దతు ధరను అమలు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయటం సరికాదని, ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిరసనలు తెలియ చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ తమ నిరసనను వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ పంటల సాగు విధానంలో ప్రత్యామ్నాయ పంటలు గుర్తింపు లాభసాటి పంటలు ప్రజల వినియోగానికి ఆహార పంటల సాగుపై రైతులు వ్యవసాయ నిపుణులు వ్యవసాయ అధికారులు రైతులతో సమగ్ర చర్చలు జరిపి నిర్ణయానికి రావటం అవసరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి చర్చలకు అవకాశం లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం రైతులను బెదిరించడానికి పూనుకోవటం సరికాదని ఇలాంటి ప్రకటనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులను చైతన్యవంతుల్ని చేయాలి తప్ప బెదిరించరాదు

విస్తృత ప్రచారం ద్వారా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పోలు సూర్యనారాయణ రెడ్డి జిల్లా నాయకులు కంబాల శ్రీనివాస్,పొనుగు పాటి వాసుదేవరావు, మామిడి నరసయ్య, రాష్ట్ర గీత పనివారల సంఘం నాయకులు పాలకూరి బాబు,మల్లేశ్వరి, బి ఎఫ్ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి రమేష్, రైతు సంఘం నాయకులు పుర ప్రముఖులు గుండా రమేష్, జడ శ్రీనివాస్, యల్లావుల లింగయ్య,గుండెబోయిన వెంకన్న,శ్రీనివాస్ మోదాల వెంకటేష్, అల్వాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

పుట్టిన రోజు నాడు అమ్మ దగ్గరకు వెళ్లలేకపోయా

Satyam NEWS

మహిళా పోలీసుల సేవలు అభినందనీయం

Satyam NEWS

బీసీ కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment