39.2 C
Hyderabad
March 29, 2024 16: 37 PM
Slider నల్గొండ

అట్టహాసంగా ఐదవ విడత చేపల పంపిణీ కార్యక్రమం

#TalasaniSrinivasayadav

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో ఐదవ విడత చేపల పంపిణీ కార్యక్రమం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్  లాంటి ముఖ్యమంత్రి ఉండటం అదృష్టమని, గతంలో ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి హుజూర్ నగర్ కు చుట్టపు చూపుగా రావడం తప్ప చేసిందేమీ లేదన్నారు.

ఆలీబాబా 40 దొంగల ఒక ముఠా తయారై పసలేని రాజకీయాలతో ప్రజలను ఇబ్బందులకు, గందరగోళానికి గురి చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఇప్పటికీ వరకు 50 శాతం పైగా గొర్రె పిల్లల పంపిణీ చేశామని, మిగతా వారికి కూడా ఈ నెల లోపే పంపిణీ చేస్తామని అన్నారు.

అనుక్షణం హుజూర్ నగర్ అభివృద్ధికి కృషి చేసే డైనమిక్ ఎమ్మెల్యే ను హుజూర్ నగర్ ప్రజలు గెలిపించుకోవడం వల్ల  అభివృద్ధి పదంలో హుజూర్ నగర్ నియోజకవర్గం నడుస్తుందని, హుజూర్ నగర్ అభివృద్ధికి తన వంతు కృషి తప్పక చేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో యాదవ్ సోదరులకు త్వరలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ZPTC  సైదిరెడ్డి, MPTC గూడెపు శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

క‌రోనా నేప‌థ్యంలో ఆద‌ర‌ణ ల‌భించ‌క రైళ్ల ర‌ద్దు..

Sub Editor

సుప్రీం కోర్టు లో వనమా కు వూరట

Bhavani

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మహోన్నతుడే ఉపాధ్యాయుడు

Satyam NEWS

Leave a Comment