27.7 C
Hyderabad
April 24, 2024 09: 47 AM
Slider ఆదిలాబాద్

గంగపుత్రుల సమస్యలను పరిష్కరించాలని రాస్తారోకో

#Fishermen

ఆసిఫాబాద్ జిల్లా  పెంచికల్పేట్ మండలంలోని చెడు వాయి గ్రామ మత్స్యకారులు  శనివారం రోజు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. తక్షణమే చెడు వాయి మత్స పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసి, తమకు తక్షణమే మంచిర్యాల చిన్న గుడి పేట సహకార సంఘం నుండి వేరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే తమను ఉచ్చ మల్ల జలాశయంలో సొంతంగా చేపలు పట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, దొంగతనం గా చేపలు పడుతున్న వారిని వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకొని ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

బయటివారు ఎవరు కూడా వచ్చి మా జలాశయంలో చేప లు పట్టరాదని వారు పెంచికలపేట, కాగజ్నగర్ ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న కాగజ్నగర్ రూరల్ సిఐ అల్లం నరేందర్, పెంచికలపేట ఎస్. ఐ .చుంచు రమేష్, తమ సిబ్బందితోసంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పి జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివ రావుతో చర్చలు జరిపించి మత్స్యకారులను ధర్నాను విరమింపజేశారు.

మత్స్య శాఖ అధికారి సాంబశివరావు మాట్లాడుతూ పెంచికలపేట మండల చెడు వాయి గ్రామ మత్స్యకారుల సమస్యలను నెల రోజులలో మంచిర్యాల అధికారులతో మాట్లాడి వీరి సమస్యను పరిష్కరిస్తామని వీరికి నూతనంగా మత్స్యకారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామని, నెలరోజుల వ్యవధిలో ఎవరు కూడా చేపలు పట్టకూడదని ఒకవేళ పట్టినట్లయితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తామని ఆయన తెలిపారు.

Related posts

ఏటూరునాగారం రేంజ్ పరిధిలో జనారణ్యంలోకి వచ్చిన పులి

Satyam NEWS

కరోనా బాధిత కుటుంబాల పిల్లల సంరక్షణ సహాయక కేంద్రం

Satyam NEWS

ఘనంగా భగత్ సింగ్ 113వ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment