చేపల వేట చేసుకునే మత్స్యకారులందరికీ చెరువులపై పూర్తి హక్కులు కల్పించడం, ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయడం లాంటి అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. మత్స్యకారులు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి రోజులు రానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘాల సభ్యులకు మత్స్యకారులకు మహిళలకు మత్స్యకార యువకులకు ఎమ్మెల్యే ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్