కేదార్‌నాథ్ మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య అయిదుగురికి చేరుకున్నది. ఇవాళ ఉదయం మరో నలుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు ఉంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. కేదారీశ్వరుడిని దర్శనం చేసుకుని వెనక్కి వస్తున్న భక్తులు.. సోమవారం రాత్రి 7.30 నిమిషాలకు విరిగిపడ్డ కొండచరియల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. వెదర్ సరిగా లేకపోవడం వల్ల సోమవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. రాత్రంతా అక్కడ రాళ్లు పడుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం పట్ల సీఎం పుష్కర్ సింగ్ థామీ సంతాపం వ్యక్తం చేశారు.
previous post