నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నదని, అందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి) చైర్మన్ బి ఎస్ ఎస్ ప్రసాద్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం వద్ద జెండా వందనం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా మండలి సిబ్బంది అందరూ కృతనిశ్చయంతో పని చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది అందరూ నీతినిజాయితీలతో పారదర్శకంగా పని చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అప్పుడే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు.
previous post
next post