28.7 C
Hyderabad
April 25, 2024 03: 52 AM
Slider విజయనగరం

మున్సిప‌ల్ ఎన్నికల వేళ విజ‌య‌న‌గ‌రంలో‌ ప్లాగ్ మార్చ్

#Flag March

విద్య‌ల న‌గ‌ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల పుణ్య‌మా అని…పోలీసులు..రోడ్లపై ప్లాగ్ మార్చ్ చేసారు. ఇటీవ‌లే ముగిసిన పంచాయితీ ఎన్నిక‌లలో నిర్వ‌హించిన‌ ఈ మాదిరిగానే విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ పోలీసులు  ప‌లు ప్రాంతాల‌లో సాయంత్రం ప్లాగ్ మార్చ్ చేసారు.

వచ్చే నెల 10 న న‌గ‌రానికి తొలిసారిగా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంతే కాక ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌,బందోబ‌స్తున‌కు సంబంధించి ఎస్పీ నేతృత్వంలో జ‌రిగిన మీటింగ్ లో న‌గ‌రంలో కార్డ‌న్ సెర్చ్, ప్లాగ్ మార్చ్,నాకా బంధీ నిర్వ‌హించాల‌ని చ‌ర్చించారు.

ఈ నేప‌ధ్యంలో విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని నాగ‌వంశ‌పు వీదిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేసారు. ఎస్టీఎఫ్,ఏఆర్,లా అండ్ ఆర్డ‌ర్ సిబ్బంది దాదాపు…500 మంది వ‌ర‌కు పోలీసులు నాగ‌వంశపు వీధి..పుచ్చ‌ల వీధి,పాత బ‌స్లాండ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో పోలీసులు…సంబంధిత డివ‌జ‌న్ ప్ర‌జ‌ల‌ను, ఓట‌ర్ల‌కు..మేమున్నాము, అధైర్యప‌డొద్ద‌ని.. .ధైర్యంగా ఓటు వేయాల‌ని..ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు తలెత్త‌కుండా ప్ర‌జ‌లంతా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు,బందోబ‌స్తునకు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు కోరారు.

ఈ సంద‌ర్బంగా డీఎస్పీ అనిల్ మాట్లాడుతూ.. తొలిసారిగా న‌గ‌రంలో జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ఓ స‌వాల్ గా స్వీకరించాల‌ని…సిబ్బందినుద్దేశించి డీఎస్పీ మాట్లాడారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

[Over-The-Counter] Vitamins To Reduce Blood Sugar Home Remedy For Diabetes Ayurvedic Home Remedies For Diabetes

Bhavani

చంద్రబాబు జన్మదిన సందర్భంగా పేదలకు కూరగాయలు

Satyam NEWS

సమస్యలు పట్టించుకోని రామాంతపూర్ కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment