భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం గంట గంటకు పెరుతున్నది. పై నుంచి వస్తున్న వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నది. పశ్చిమగోదావరి జిల్లా కుకునూర్, వేలేరుపాడ్ మండలంలో కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. కుకునూర్, దాచారం మధ్య గల వంతెన పైకి గోదావరి వరద నీరు చేరింది. దాచారం, బెస్తగూడెం, గొమ్ముగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తమ పొలాల్లోకి వస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలేరుపాడ్ మండలం లోని ఎద్దు వాగు కాజు పైకి వరద నీరు చేరడంతో మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోయిదా, కాకీస్నూరు, ఎడవల్లి కట్కూరు, చిగురుమామిడి ,తాళ్ళ గొమ్ము, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
previous post