నిన్న మొన్నటి వరకు కృష్ణానది ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో వరద ప్రకాశం బ్యారేజీకి పోటెత్తితే, ఇప్పుడు భారీగా లోకల్ వరద నీరు వస్తోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బ్యారేజీకి ఈ వరద మొదలైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మున్నేరు, మధిర వాగుల నుంచి నీటిప్రవాహం అధికంగా వస్తున్నదని, ఈ రెండు వాగుల నుంచి బ్యారేజీకి 30వేల క్యూసెక్కుల నీరు చేరుతున్నదని అధికారులు తెలిపారు. మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు. దాంతో 18500 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళుతున్నది. మరో 14,500 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదులుతున్నారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా సుమారుగా 300 టీఎంసీల నీరు సముద్రంలోకి వదిలారు. మరో రెండు, మూడు రోజులపాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
previous post
next post