భద్రాచలంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్దకు భారీగా వరదనీరు చేరింది. అన్నదాన సత్రం పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. పడమర మెట్ల వైపు మోకాలు లోతు నీరు చేరడంతో భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. కరకట్ట వద్ద లూయిస్‌ను మూసి ఉంచడంతో వర్షపునీరు డ్రైనేజీ గుండా గోదావరిలో కలవడం లేదు. దీంతో కాంప్లెక్స్‌లో వర్షపునీటితో పాటు మురుగు చేరింది. కరకట్ట విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేయడంతో మురుగునీటిని డంపింగ్ చేస్తున్నారు. సమీపంలోని దుకాణాల్లోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి వైపు నుంచి వరద చేరుతోంది. దీంతో నీటమట్టం పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
previous post