30.2 C
Hyderabad
September 14, 2024 16: 58 PM
Slider ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద

HY15NAGARJUNASAGAR

కృష్ణమ్మకు అనూహ్యంగా వరద నీరు పెరిగింది. దాంతో నాగార్జున సాగర్ కు వరద రెట్టింపైంది. 80 వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు చేరుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశాయలకు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతుండగా, జూరాల మీదుగా నాలుగున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. అక్కడ నుంచి నాగార్జున సాగర్ కు వరదనీరు పోటెత్తుతున్నది. నిన్నటి వరకూ రెండు లక్షల క్యూసెక్కులకు అటూ ఇటుగా సాగిన వరద నీటి ప్రవాహం రెట్టింపు కావడంతో, అధికారులు పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నికరంగా 2.40 లక్షల క్యూసెక్కల నీరు రోజుకు నిల్వ అవుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 871 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రారంభమైంది. జలాశయంలో 215 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యముండగా, ప్రస్తుతం సుమారు 150 టీఎంసీల నీరుంది. ఇప్పుడున్న వరద కొనసాగితే, మధ్యాహ్నానికే నీరు క్రస్ట్ గేట్లను తాకి, కిందకు దూకేందుకు సిద్ధంగా ఉంటుంది.

Related posts

తెలంగాణ సామాజిక రచయితల మాతృభాష దినోత్సవం

Satyam NEWS

సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.25 కోట్ల హెరాయిన్‌ సీజ్

Sub Editor

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆకర్షణీయంగా తెలంగాణ పెవిలియన్

Satyam NEWS

Leave a Comment