38.2 C
Hyderabad
April 25, 2024 11: 46 AM
Slider కడప

అన్నమయ్య డ్యామ్ వరద ధాటికి అతలాకుతలం అయిన పరీవాహక గ్రామాలు

#annamayyadam

కడప జిల్లా రాజంపేట అన్నమయ్య డ్యామ్ వరదనీటి దాటికి అతలాకుతలం అయిన పరివాహా గ్రామాలు ఇంకా కొలుకోలేదు. పులపుత్తూరు,తొగురు పేట,రామచంద్రాపురం,ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె, గుండ్లూరు, హేమాద్రి పురం,నందలూరు అరుంధతి వాడ, హరిజన వాడ తదితర గ్రామాల్లో ఇంకా భయం తొంగి చూస్తున్నది. వరద విలయం దాటికి కుప్పకూలిన గృహాలు పునఃనిర్మిచేందుకు ప్రస్తుత పరిస్థితులలో కష్టం అవుతుందని బాధితులు భావిస్తున్నారు.

ఇండ్లలో చేరిన బురద నీరు ఇంకా పూర్తిగా పోలేదు. వరద ఉధృతికి ఇండ్లలోని అన్నీ రకాల సామాగ్రి పూర్తిగా ఉపయోగ పడకుండా పోయాయి. సకాలంలో అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు స్పందించ లేదనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.

ఉన్న పొలాలు పూర్తిగా ఉపయోగం లేకుండా ఇసుక మెటలు వేసాయి.లెక్క తెల్లని ముగాజీవాలు మృతి, ఇప్పటికి ఆచూకీ లేని మనుషుల గల్లంతు, రోడ్లు,విద్యుత్,స్తంభాలు ధ్వంసం పరివాహా ప్రజల జీవన విధానాన్ని కన్నీరు పెట్టించేలా ఉంది. ఆదు కుంటామని అధికారులు,ప్రజా ప్రతినిధులు అంటున్నారే కానీ ఎలా ఆదుకుంటారురో సృష్టత లేదు. పరమర్శలో  ప్రజాప్రతినిధులు విమర్శ లు వినబడుతున్నాయి.

Related posts

ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోటీ

Satyam NEWS

డాక్టర్ యం.వి.రమణారెడ్డి ఆకస్మిక మృతి తీరనిలోటు

Satyam NEWS

విజయవంతంగా వార్డు సెక్రటేరియేట్ పరీక్షలు

Satyam NEWS

Leave a Comment