ఇది ఎందుకు అంటారా? పర్యావరణంలో కోతులు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే కోతుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే అడవులు కొట్టేయడం, చెట్లు లేకుండా పోవడం తదితర కారణాలతో కోతులు ఊళ్ల మీదపడుతున్నాయి. దొరికింది దొరికినట్టు ఎత్తుకు పోతున్నాయి. మనుషులైతే ఆహారం తమకు తాము సమకూర్చుకుంటారు. మరి ఇలాంటి కోతులు ఏం చేయాలి? ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ ‘వానరాల కోసం ఫుడ్ కోర్టు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో దాదాపు 20 వేల వానరాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి కోసం వంద బ్లాకుల్లో 20 లక్షల మొక్కలు నాటాలని, అందులో18 రకాల పండ్ల మొక్కలు ఉండాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాలు లేని సమయంలో ఉపాధి కూలీలతో మొక్కలకు నీరందించాలని సూచించారు. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ ఫుడ్ కోర్టును నిన్న సందర్శించి కలెక్టర్ చొరవను అభినందించారు. భవిష్యత్తులో జగిత్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శం కానుందని ఆకాంక్షించారు.
previous post
next post