27.7 C
Hyderabad
April 25, 2024 10: 48 AM
Slider గుంటూరు

లాక్ డౌన్ ఉన్నంతకాలం పేదలకు ఆహారం అందిస్తా

chadalawada 031

దేశంలో లాక్ డౌన్ ఉన్నంత కాలం పేద ప్రజలకు అవసరమైన ఆహారం అందిస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు యాచకులకు, అనాథలకు నరసరావుపేట పట్టణ శివారులో ఆయన భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మనిషికి మనిషికి మధ్య కనీస దూరం పాటించాలని, రోజుకు 10 నుంచి 15 సార్లు చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు.

తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్తే నోటిని, ముక్కును ఫేస్ మాస్కుతో కప్పి ఉంచాలని, వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని డాక్టర్ చదవలవాడ చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 20 మందికి గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాచని అన్నారు. వారు చికిత్స పొందుతున్నారని, విదేశాల నుండి ఎవరైన వస్తే వారి సమాచారం ప్రభుత్వ అధికారులకు తక్షణమే తెలియజేయాలని ఆయన కోరారు. కరోనా వైరస్ వచ్చిన తరువాత బాధపడటం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Related posts

స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు నివాళి

Satyam NEWS

వెంకన్న స్వామి పై ప్రమాణం చేయించి….ఇండ్ల పట్టాల పంపిణీ…!

Bhavani

ఇదేం జమానా? బతుకమ్మ కూడా ఆడనివ్వరా??

Satyam NEWS

Leave a Comment