37.2 C
Hyderabad
March 29, 2024 18: 17 PM
Slider మహబూబ్ నగర్

నిరుపేదలకు చేయుతనిచ్చిన రంగాపురం శివారెడ్డి

rangapur

కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా  పాన్ గల్  మండల పరిధిలోని రేమద్దుల గ్రామానికి చెందిన హర్షన్న యువసేన ప్రజలకు నిత్యావసరాలు అందచేసింది. హర్షన్న యువసేన నియోజకవర్గ  అధ్యక్షులు రంగాపురం శివారెడ్డి తన మిత్రుల సహకారంతో  రేమద్దుల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

గ్రామంలోని 35 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల విలువ గల ఇరవై ఐదు కేజీల సన్నరకం బియ్యం, కేజీ పప్పు, 10 గుడ్ల చొప్పున పంచిపెట్టారు. ఎస్సై శ్రీనివాస్, ఎంపీటీసీ పత్తికొండ కరుణాకర్ రెడ్డి ల చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో విండో డైరెక్టర్ ప్రసాద్ రావు, ఉపసర్పంచ్ రాంబాబు,TRS  నాయకులు మోటురి తిరుపతయ్య, ఎద్దుల రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, గోపాల్ రావు, భగత్, హార్షన్న యువసేన నాయకులు రవీందర్ సాగర్,రఘు సాగర్,రాము,నరవర్దన్ రెడ్డి,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి

Satyam NEWS

తెలంగాణ లో పాఠ్యాంశంగా నైతిక విలువలు

Satyam NEWS

భార్యల పదవి మాటున దౌర్జన్యాలు చేస్తున్న భర్తలు

Satyam NEWS

Leave a Comment