30.3 C
Hyderabad
March 15, 2025 10: 21 AM
Slider నల్గొండ

గుడ్ వర్క్: పారిశుధ్య కార్మికులకు అన్న వితరణ

#Food Distribution

పారిశుధ్య కార్మికుల కార్మికులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని నల్లగొండ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కాచం ఫౌండేషన్ సభ్యుడు, టిఆర్ఎస్ నాయకుడు కాసం శేఖర్ కుమారుడు కాసం సంతోష్ జన్మదిన సందర్భంగా స్థానిక కామేశ్వర్ రావు కాలనీలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అన్నవితరణ కార్యక్రమాన్ని శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడి కోసం పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవని చెప్పారు. ప్రతి నిత్యం రోడ్లు, కాలనీలతో పాటు ఇండ్లలో చెత్తను శుభ్రం చేస్తూ కరోనా కట్టడిలో కీలకంగా పనిచేస్తున్నారని అలాంటి కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కాచం ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.

అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాచం ఫౌండేషన్ సభ్యులు కాసం శేఖర్, కాసం వెంకటేశ్వర్లు, శోభారాణి, నర్సమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, టిఆర్ఎస్ యామ దయాకర్, నాయకులు నాళ్ల వెంకటేశ్వర్లు, జేరిపోతుల భాస్కర్, తదితరులున్నారు.

Related posts

ఫైరింగ్ :జమ్మూలోఎన్‌కౌంటర్‌ హిజ్బుల్ఉగ్రవాది హతం

Satyam NEWS

వైద్య కళాశాలలో తరగతులను ప్రారంభించనున్న సి‌ఎం

Murali Krishna

సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోతా

mamatha

Leave a Comment