31.2 C
Hyderabad
April 19, 2024 06: 52 AM
Slider మహబూబ్ నగర్

పాపం 40 మంది పిల్లలు:వికటించిన మధ్యాహ్న భోజనం

kollapur

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గ్రామంలో చంద్రకల్ గ్రామంలో మధ్యాహ్నం భోజనం వికటించి 40 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. రోజు మాదిరిగానే ఈ రోజు మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత అరగంట వ్యవధి లోనే వాంతులు విరోచనాలతో కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

ఇది గమనించిన ఉపాధ్యాయులు అంబులెన్స్ కు కాల్ చేసి వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.40 మంది విద్యార్థుల లో నలుగురి పరిస్థితి విషమం విషమంగా ఉందని , మిగిలిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం మీ పాఠశాలలో 170 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికి 40 మందికి అస్వస్థతకు లోనయ్యారు.

ఇదే కాక మరి కొంత మంది విద్యార్థులు కూడా వాంతులు విరోచనాలు బారిన పడి ఆస్పత్రికి వస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు.ఈ ఫుడ్ పాయిజన్ విషయం గురించి విద్యార్థులు అడిగి తెలుసుకో గా మధ్యాహ్నం అన్నం తో పాటు వంకాయ కూర కూడా తిన్నట్లు దాంతోపాటు, తాగిన నీళ్ళల్లో ఏదైనా కలుషితం జరిగి ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానిస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియకుండా నేరుగా ఆస్పత్రికి తరలించి అనంతరం విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలపడంతో ఆస్పత్రి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల  తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్,నాగర్ కర్నూలు జడ్పీ చైర్మన్ పద్మావతి ఆసుపత్రి కి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి  డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా విషయం తెలుసుకొని నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

Related posts

నాట్లు వేసిన పద్మాదేవేందర్ రెడ్డి

Bhavani

నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్ `ఫిఫిఫీ…ఫిఫీ..ఫి

Satyam NEWS

అమరావతిపై జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment