35.2 C
Hyderabad
April 24, 2024 11: 49 AM
Slider మహబూబ్ నగర్

గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురైనా పట్టించుకోరా?

#malachitanyasamiti

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఉన్న ఎస్ సి గురుకుల పాఠశాలలో పదకొండు మంది విద్యార్థినులు అస్వస్థకు గురై కొల్లాపూర్ పట్టణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా నేటికీ సంబంధిత అధికారులు పరామర్శించకపోవడం దారుణమని మాలల చైతన్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

అపరిశుభ్రమైన ఆహారం అందించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాలల చైతన్య సమితి డిమాండ్ చేసింది. ఈ నెల 28వ తేదీ అపరిశుభ్రమైన ఆహారం కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వారు తెలిపారు. 8 ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఎస్ సి గురుకుల విద్యార్థినిలకు వసతి భవనం లేకపోవడం తో విద్యార్థినిలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు.

చదువుకోవడానికి సరైన తరగతి గదులు లేక సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, గురుకులాల ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్ తక్షణమే స్పందించాలని వారు కోరారు.

ఈ సమస్యలపై చొరవ చూపాలని కొల్లాపూర్ ఆర్ డి ఓ కి మాలల చైతన్య సమితి వినతి పత్రం అందించింది. ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్, తాలూకా అధ్యక్షులు  అవుట ఎర్ర శ్రీనివాసులు, జిల్లా నాయకులు బి కె మూర్తి, మండల అధ్యక్షులు బి జ్జ సురేందర్, బాపనపల్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒకే రోజు వెయ్యి మందికి ప్రయివేటు ఉద్యోగాలు

Satyam NEWS

క్వారంటైన్ నిబంధన తొలగించిన బ్రిటన్ ప్రభుత్వం

Satyam NEWS

BJP Open letter: 10వ తేదీన కాణీపాకం వస్తావా రాచమల్లూ?

Satyam NEWS

Leave a Comment