తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరుగుతుండగా కరీంనగర్ జిల్లా గాంగధర మండలంలో మాత్రం అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి పులిహోర ప్రసాదం తిని సుమారు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. లింగంపల్లి గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రసాదం తిన్న వెంటనే వాంతులవడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇంత మంది అస్వస్థతకు గురవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. గణేశుడి ప్రసాదంలో కుట్రపూరితంగా ఎవరైనా విషం కలిపారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
previous post
next post