24.2 C
Hyderabad
October 14, 2024 21: 02 PM
Slider తెలంగాణ

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం

KCR Food processing

ఐటిసి చైర్మన్ సంజీవ్ పురి, ఇ.డి. నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు సంజయ్ సింగ్, ఉషారాణి ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఐటిసి లిమిటెడ్ ను  కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్ధాలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని సిఎం చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటిసి చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సంజీవ్ పురి వివరించారు. తెలంగాణలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

‘‘వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్ధాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగ పెట్టుకున్నది. ఈ లక్ష్య సాధనకు ఈ రంగంలో అనుభవం కలిగిన ఐటిసి కలిసి రావాలి. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నాయి. ముడి సరుకు సేకరణలో, ఇతరత్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు. ములుగు జిల్లాలో రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటిసి చొరవ చూపాలని సిఎం కోరారు. దీనికి ఐటిసి అధికారులు సానుకూలంగా స్పందించారు.

Related posts

నెల్లూరు జిల్లాలో ముగ్గురు తాహసిల్దార్ల సస్పెన్షన్…!

Bhavani

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న టాస్క్ ఫోర్స్

Satyam NEWS

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సాయం చేసి వారికి జైలు

Satyam NEWS

Leave a Comment