39.2 C
Hyderabad
March 28, 2024 16: 46 PM
Slider ఖమ్మం

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలి

#Gautham

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని స్వయం సహాయక సంఘాల గ్రూప్ సభ్యులు, మెప్మా గ్రూప్ సభ్యులు, వివిధ శాఖల ద్వారా నమోదైన ఎఫ్ పీవో సభ్యులు, నిరుద్యోగ యువత, ఔత్సహిక పారిశ్రామికవేత్తల ఆర్థికాభివృద్ధి కి ప్రభుత్వాలు చేయూత నిస్తాయని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

“ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం-తయారీ సంస్థల క్రమబద్దీకరణ” క్రింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13 న భక్త రామదాసు కళాక్షేత్ నందు ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమము నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి అష్ట లక్ష్మి ఎంటర్ ప్రైజస్, కార్తికేయ ఎంటర్ ప్రైజస్, బెస్ట్ ఇంజనీరింగ్ సంస్థల ద్వారా రోస్టర్ ఆయిల్ ఎక్సపెల్లర్, పల్వరైజర్, దాల్ మిల్, ఇండియన్ స్నాక్స్ మేకింగ్ ఎక్విప్మెంట్, అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీలను ప్రదర్శించబడతాయన్నారు.

వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పేందుకు ఔత్సహికులు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు. ఔత్సహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేయాలనీ, దాంతో ఉమ్మడి ఖమ్మం జల్లాలో అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

అదేవిధంగా ప్రజల అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటుపై ఔత్సహికులకు వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పిస్తారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బ్యాంకు అధికారులు ఇట్టి కార్యక్రమములో పాలుపంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.

ఉత్సహవంతులకు అదే రోజున స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడునని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని ఔత్సహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువత, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ కార్యక్రమం లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నార

Related posts

ఆర‌వ విడ‌త‌ హరితహారాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

Bhavani

జస్టిస్ ఫర్ దిశ కేసులో నేరస్తులను కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment