36.2 C
Hyderabad
April 25, 2024 21: 02 PM
Slider ఆదిలాబాద్

రాజస్థాన్ వలస కూలీలను ఆదుకున్న పాయల్ శంకర్

#Payal Shankar BJP

కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు కాలిబాటన ఇంకా సొంత రాష్ట్రాలకు తరలి వెళ్తూనే ఉన్నారు. వందలాది వలస కుటుంబాలు అష్టకష్టాలు పడుతూ హైదరాబాద్ నుండి రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలకు మూటాముల్లె గట్టుకుని పిల్లాపాపలతో తరలి వెళ్తుండగా ఈ సమాచారం తెలుసుకున్న బిజెపి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పార్టీ నేతలను వెంటపెట్టుకుని వారందరికీ జిల్లా సరిహద్దులోని పిప్పర్వాడ వద్ద కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

వారు వందల కిలోమీటర్లు నడిచి అలసిపోయి సేద తీరగా పాయల్ శంకర్ స్పందించి వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. పిల్లలకు బిస్కెట్లు పానీయాలు అందించారు. కార్మికులు కాలిబాటన వెళ్లకూడదని ప్రభుత్వం వారి కోసం ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూలీలకు చేతినిండా పని కల్పించడంతోపాటు అన్నిచోట్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నారని ఉపాధి కూలీ రేట్లను కూడా పెంచారని తెలిపారు. 155 మంది కూలీలను ప్రత్యేకంగా వాహనాల్లో రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలకు దగ్గరుండి తరలించారు.

 కష్టకాలంలో ఆదుకున్న బీజేపీ నేతలకు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కు వలసకూలీ కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శంకర్ వెంట వి ఆదినాథ్, కేశవ్, దినేష్, రాకేష్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్ర బస్సులో మంటలు – 25మంది మృతి

Satyam NEWS

దిల్ రాజు విడుదల చేయనున్న “మెకానిక్” మోషన్ పోస్టర్!!

Satyam NEWS

జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకo

Murali Krishna

Leave a Comment