మెరుగైన సమాజం కోసం రోజుకొక్క రూపాయి, ఒక్కనిమిషం అనే సేవా దృక్పథంతో కొల్లాపూర్ నియోజక పరిధిలో కొనసాగుతున్న క్లాస్ మెంట్ క్లబ్ నియోజకవర్గ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణం కేంద్రంలో క్లాస్ మెంట్ క్లబ్ కార్యాలయంలో నూతన కార్యవర్గం నియోజకవర్గ అధ్యక్షులు అర్థం రవి, ప్రధాన కార్యదర్శి గౌరం ధనుంజయ గౌడ్, కార్యదర్శిగా సోమిశెట్టి రాంప్రసాద్ లను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి బృంగి కృష్ణ ప్రసాద్, కోశాధికారిగా కాశీపురం మహేష్ చెప్పారు.
ఎన్నుకున్న సభ్యులను శాలువలతో సన్మానించారు. క్లాస్ మెంట్ క్లబ్ సేవలు కొల్లాపూర్ నియోజకవర్గంలో మరింత అందిస్తామని నూతన కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆకుతోట సుదర్శన్ శెట్టి, కంభం నరేష్, శశి కుమార్, సాయిరాం, సాయి ప్రకాష్ శెట్టి, శేషయ్య గుప్తా, రాజశేఖర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.