35.2 C
Hyderabad
April 20, 2024 14: 59 PM
Slider ప్రత్యేకం

రీడ్ ఇండియా సెలబ్రేషన్ ఫైనలిస్టుల జాబితా ఇదే

#readindiacelebration

విద్యార్ధులలో చదివే అలవాటును పెంపొందించి తద్వారా సహజ లక్షణాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న ‘రీడ్‌ ఇండియా సెలబ్రేషన్‌’ నిర్వహించిన పోటీలో అంతర్జాతీయంగా 3.3 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు.  స్వతంత్ర భావాలను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలోని 1000కు పైగా పాఠశాలల నుంచి ఈ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల నుంచి ఒక లక్ష కు పైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా రీడ్‌ ఇండియా సెలబ్రేషన్‌ నిర్వహించిన ఈ పోటీలో  పాల్గొన్న వారి నుంచి న్యాయ నిర్ణేతల కమిటీ 22 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేసింది.

న్యాయ నిర్ణేతల కమిటీలో డాక్టర్‌ రమణచర్ల ప్రదీప్‌ కుమార్‌(రిజిస్ట్రార్‌ అండ్‌ ప్రొఫెసర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌), సుమన మౌద్గల్‌ (అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ కాలేజీ కౌన్సిలింగ్‌ – వెస్ట్‌ మినిస్టర్‌ స్కూల్స్‌, అట్లాంటా, జార్జియా) రాజ్‌ పనిశెట్టి (సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌– ఎంటర్‌ప్రైజ్‌ రొబోటిక్స్‌ అండ్‌ ఇంటిలిజెంట్‌ ఆటోమేషన్‌ ఫర్‌ లార్జ్‌ ఫైనాన్షియల్‌ ఆర్గనైజేషన్‌, న్యూయార్క్‌) ఉన్నారు.

ఈ కార్యక్రమంలో అభ్యర్థులను నాలుగు విభిన్న విభాగాలుగా విభజించారు. విజేతలకు అంటే తొలిస్థానంలో నిలిచిన వారికి ల్యాప్‌టాప్‌లను, ద్వితీయ  స్థానంలో నిలిచిన వారికి ట్యాబ్లెట్స్‌, నగదు బహుమతి అందజేస్తారు. రీడ్‌ ఇండియా సెలబ్రేషన్స్‌ ఫౌండర్‌ రఘురామ్‌ అనంతోజ్‌ మాట్లాడుతూ ‘‘ ప్రాక్టికల్‌ రీడింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలను విద్యార్థులలో మెరుగుపరిచేందుకు లక్ష్యంగా చేసుకున్న కార్యక్రమం రీడ్‌ ఇండియా సెలబ్రేషన్‌. మేము దీనిని మూడు అంశాలు – చదవడం, ఆలోచించడం మరియు అమలు చేయడం పై దృష్టి సారించి చేస్తున్నాము.

ఈ కార్యక్రమానికి  ఒమన్‌, ఖతార్‌, యుఏఈ, యుఎస్‌ఏ లాంటి దేశాల నుంచి కూడా  రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆర్‌ఐసీ లక్ష్యం,  ఇండియాను విజ్ఞాన ఆధారిత సంస్కృతి కలిగిన దేశంగా తీర్చిదిద్దడం. 2022 సంవత్సరం కోసం మేము ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకూ చేరువ చేయనున్నాము. తమ ప్రాంతీయ భాషలలో మరింత మంది మాట్లాడేలా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు.

‘‘చదవని, ఆలోచించని మరియు స్వతంత్య్రంగా ఆలోచించని దేశం ఎన్నటికీ అభివృద్ధి చెందదు. చదువరులతో కూడిన భారతదేశం నేను చూడాలనుకుంటున్నాను. అలాగే స్వతంత్య్ర ఆలోచనలు కలిగిన వ్యక్తులనూ చూడాలనుకుంటున్నాను. ఆవిష్కర్తలతో కూడిన భారతదేశాన్ని  నేను చూడాలనుకుంటున్నాను. మరింత మంది ప్రజలు చదవడం ప్రారంభిస్తే, అది దేశంలో పెనుమార్పులకు కారణమవుతుంది’’అని అనంతోజ్‌ అన్నారు.

‘‘మన సొంత అజ్ఞానం, అజ్ఞానంతో కూడిన ప్రజలు, అజ్ఞానంతో కూడిన సమాజం మనం జీవిస్తున్న పర్యావరణ వ్యవస్థకు గొప్ప ముప్పు అని మనందరికీ గుర్తు చేసే ఓ గొప్ప వేదిక ఇది. అక్షరజ్ఞానం కలిగిన వారిని విద్యావంతులుగా మార్చే శక్తి దీనికి  ఉంది. ఈ అనుభవాలను సొంతం చేసుకోవడంలో ప్రతి అభ్యాసకుడూ ఓ విజేతగా నిలువగలడు !

ఈ మూడు అంశాలపై దృఫ్టి సారించడం ద్వారా మేము దీనిని సాధ్యం చేయగలము…

ఆర్‌ఐసీ 2021– చదవడం, ఆలోచించడం, ప్రయత్నించడం – ఇది చదవడం (3 ఆర్‌లు), ఆలోచన (స్వతంత్య్ర), ప్రయత్నం (తెలివితేటలు ) ఆధారితం.

1.3ఆర్‌లపై దృఫ్టి సారించే రీడ్‌ (చదవడం), పుస్తకాలు చదవడం, స్వీయ అభ్యాసం, పరిస్ధితులను అధ్యయనం చేయడం

2.వృద్ధిని సాధ్యం చేసే మూడు అంశాలపై దృష్టి సారించే ఆలోచన

3.ఆ మూడు అంశాలను ఆచరించేందుకు ప్రయత్నించడం

ఆర్‌ఐసీ 2021 విజేతలు (మొదటి బహుమతి: ల్యాప్‌టాప్‌,  ద్వితీయ బహుమతి: ట్యాబ్లెట్‌)

విభాగం: 3–5 గ్రేడ్‌

మొదటి బహుమతి – కాశ్వీ కౌలేష్నమ్‌, గ్రేడ్‌  ; పాఠశాల – నారాయణ ఈ టెక్నో స్కూల్‌,  వినల్లురహల్లి, వైట్‌ ఫీల్డ్‌, బెంగళూరు,  కర్నాటక

ద్వితీయ బహుమతి – ప్రణయ్‌ త్యాగి ; గ్రేడ్‌ –3 ; పాఠశాల – చాబిల్‌ దాస్‌ పబ్లిక్‌ స్కూల్‌, పటేల్‌ నగర్‌, సీహెచ్‌ చాబిల్‌ దాస్‌ మార్గ్‌, ఘజియాబాద్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌

కన్సోలేషన్‌ బహుమతి – ఆయేషా సింగ్‌ ; గ్రేడ్‌ –4 , స్కేర్డ్‌ హార్ట్‌ కాన్వెంట్‌ స్కూల్‌, శరభ నగర్‌ ,  లుథయానా, పంజాబ్‌

విభాగంః 6–9 వ గ్రేడ్‌

మొదటి బహుమతి – అనన్య రాజీవ్‌ ; గ్రేడ్‌ 9, పాఠశాల ః నారాయణ ఒలింపియాడ్‌ స్కూల్‌, కస్తూరి నగర్‌, బెంగళూరు, కర్నాటక

ద్వితీయ బహుమతి – మాన్వీ కేలానీ; గ్రేడ్‌ –9, నాథ్‌ వ్యాలీ స్కూల్‌, పైఠాన్‌ రోడ్‌, ఔరంగాబాద్‌, మహారాష్ట్ర

విభాగంః 10–12 గ్రేడ్‌

మొదటి బహుమతిః  ఆనందిని శర్మ ; గ్రేడ్‌ –10 ; పాఠశాలః కెవీ నెంబర్‌ 1, సాల్ట్‌ లేక్‌ , కోల్‌కతా, లేబనోయ్‌ సెక్టార్‌ 1, సాల్ట్‌ లేక్‌, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌

ద్వితీయ బహుమతి – జాహ్నవి హేమరాజ్‌ భత్తి, గ్రేడ్‌ –12, పాఠశాల – కేంద్రీయ విద్యాలయ నెంబర్‌ 1, వాస్కో, వరుణపురి, మంగూర్‌ హిల్‌, వాస్కో డ గామా, గోవా

విభాగంః అండర్‌ గ్రాడ్యుయేట్స్‌, గ్రాడ్యుయేట్స్‌

మొదటి బహుమతి: అనఘ పీ; కోర్సు – బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ, మూడవ సంవత్సకం, కాలేజీః స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ ; కొచిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ; సౌత్‌ కలమ్‌స్సెరీ, ఎర్నాకుళం, కేరళ

ద్వితీయ బహుమతి – ఆర్చీ అడ్వానీ, కోర్సుః బీకామ్‌ హానర్స్‌, కాలేజీః డీఏవీ కాలేజ్‌ ఫర్‌ గాళ్స్‌, యమునా నగర్‌, హర్యానా

విజేతలు మరియు పాల్గొన్నవాందరికీ అభినందనలు !!

‘‘భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత సంస్కృతి కలిగిన దేశంగా తీర్చిదిద్దడం ఆర్‌ఐసీ లక్ష్యం. 2022 కోసం ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ తీసుకువెళ్లడం. ప్రాంతీయ భాషలలో అభ్యర్థులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. చదవడం రాని, ఆలోచించలేని మరియు స్వతంత్య్రంగా ఉండలేనలేనటువంటి దేశం ఎన్నటికీ వృద్ధి చెందదు. చదువరులతో కూడిన భారతదేశంను  నేను చూడాలనుకుంటున్నాము, స్వతంత్య్ర  ఆలోచనలతో కూడిన  భారతదేశాన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఆవిష్కర్తలతో కూడిన భారతదేశాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అధిక సంఖ్యలో ప్రజలు చదవడం ఆరంభిస్తే అది దేశంలో గేమ్‌ ఛేంజర్‌గా మారుతుంది’’ అని రఘురామ్‌ అనంతోజ్‌, ఫౌండర్‌, రీడ్‌ ఇండియా సెలబ్రేషన్స్‌ అన్నారు.

For more details, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098

Related posts

జడ్పీ చైర్మన్‌ పదవులకు వైసీపీ జాబితా ఖరారు..?

Satyam NEWS

“ఫ్రెండ్ షిప్” టైటిల్ లోగో ఆవిష్కరించిన మంత్రాలయం పీఠాధిపతి

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ అందరికి అవసరం లేదు

Satyam NEWS

Leave a Comment