40.2 C
Hyderabad
April 24, 2024 16: 54 PM
Slider గుంటూరు

రెండు మండలాలకు రెండు నెలల నుంచి ఒకే తహసిల్దారా..!?

#chilakaluripet

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండల తహసిల్దార్ సుజాత రెండు నెలల సెలవులో వెళ్లారు. ఈనెల 4వ తేదీతో రెండు నెలలు సెలవు ముగిసింది. వీరి స్థానంలో చిలకలూరిపేట తహశీల్దారుగా నాదెండ్ల తాసిల్దారు మల్లికార్జునరావును  రెండు నెలలపాటు ఇన్చార్జి తహసిల్దార్ గా పూర్తి బాధ్యతలతో నియమించారు.

ఒకే తహసీల్దార్ రెండు మండలాలకు తహసిల్దార్ గా విధులు నిర్వహించాలంటే ఒక మండలానికి  అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయని రెండు మండలాల ప్రజలు చర్చించుకుంటున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో తహసిల్దార్ లకు ప్రభుత్వం ఇన్సిడెంట్ కమాండర్ బాధ్యతలను కట్టబెట్టింది.

ఈ పరిస్థితుల్లో రెవెన్యూ కార్యకలాపాలు చేయవలసిన పనులు ప్రతి సోమవారం నిర్వహించవలసిన స్పందన కార్యక్రమాలు, జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో తదితర కార్యకలాపాలు నిర్వహించాలంటే రెండు మండలాల్లో ఒక అధికారి ఎలా నిర్వహిస్తారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కావున చిలకలూరిపేట మండలానికి పూర్తిస్థాయి తాసిల్దార్ ను కానీ, సెలవుపై వెళ్ళిన తహసిల్దార్ చిలకలూరిపేట కు వచ్చేలా చేయడం గానీ చేయాలని జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related posts

రూ.కోటి సాయం చేసిన తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో వైసీపీ,తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

Satyam NEWS

పెళ్లి వేడుకకు వచ్చారు..శవాలై వెళ్లారు

Satyam NEWS

Leave a Comment