37.2 C
Hyderabad
March 29, 2024 20: 24 PM
Slider ప్రత్యేకం

తీర ప్రాంత గ్రామాల్లో ప‌ర్య‌టించిన స‌త్యం న్యూస్.నెట్…

#forest

ఏపీ రాష్ట్ర అట‌వీ శాఖ‌లో మొక్క‌ల పెంప‌కం…వృక్షాల‌ను కాపాడ‌టం కోసం  ఓ వైపు క‌న్స‌ర్ వేష‌న్ మ‌రోవైపు సోష‌ల్ ఫారెస్ట్ వింగ్ ల ప‌ని చేస్తున్న సంగ‌తి విదిత‌మే. గ‌త రెండేళ్ల నుంచీ రాష్ట్రంలో  సామాజిక అట‌వీ( సోష‌ల్ ఫారెస్ట్) త‌న ప‌రిధిని విస్త‌రించే ప‌నిలో భాగంగా విరివిగా మొక్క‌ల పెంప‌కంపై దృష్టి పెట్టింది.

ఇటీవ‌లే ఉత్త‌రాంద్ర‌లోని పాడేరు లో సోష‌ల్ ఫారెస్ట్ విభాగం చేస్తున్న మొక్క‌ల పెంప‌కంపై ఏకంగా మ‌న్యం లోని అడుగుపెట్టిన స‌త్యం న్యూస్.నెట్, ఈ సారి తీర ప్రాంతల గ్రామాల‌లో అస‌లు సోష‌ల్ ఫారెస్ట్ ఏ విధంగా ప‌ని చేస్తోందో అన్న ప‌రిశీల‌న‌కు బ‌య‌లు దేరింది.ఈ మేర‌కు సోష‌ల్ ఫారెస్ట్ విభాగపు అధికారి జాన‌కీరామ్ తో క‌లిసి స‌త్యం న్యూస్.నెట్. ప్ర‌తినిధి తీర ప్రాంతాలైన‌ పూసపాటిరేగ‌, కోనాడ‌, ముక్కాం, భోగాపుం వంటి ప్రాంతాలలో జ‌రుగుతున్న సోష‌ల్ ఫారెస్ట్ గురించి క‌నుక్కొనే య‌త్నం చేసింది.

తొలుత ప్రఖ్యాత పుణ్య తీర్ధం రామ‌తీర్ధం మీదుగా పూస‌సాటిరేగ చేరుకున్నారు… స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి.అక్క‌డే రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల ఎదురుగా వృధాగా పోతున్న నీటికి ఓ చెరువుగా మార్చి చుట్టూ న‌డ‌క దారి నిర్మించి..ప‌రిస‌ర ప్రాంతంలో మొక్క‌లు నాటే య‌త్నం చేస్తోంది…సోష‌ల్ ఫారెస్ట్ విభాగం.

అక్క‌డ నుంచీ ముక్కాం వెళ్లి దారి పొడువున దాదాపు  6 కిలో మీట‌ర్ల దూరాన గ‌తంలో నాటిన స‌రుగుడు,టేకు,వేప‌, వంటి మొక్క‌లు పెరిగి పెద్ద‌వడంతో అవి ఏవిధంగా ఈ స్థాయి వ‌చ్చాయో వివ‌రించారు..స్థానిక వ‌న సంర‌క్ష‌ణ స‌మితి ఉద్యోగి రాజ‌శేఖ‌ర్.

అక్క‌డ నుంచీ కోనాడ కు చేరుకోవ‌డంతో అక్క‌డే వీఎస్ఎస్ ల‌తో  జ‌రుగుతున్న న‌ర్స‌రీ ని  ద‌గ్గ‌రుండీ చూపించారు..డీఎఫ్ఓ జాన‌కీరావు.గ‌డ‌చిన 16 నెల‌లుగా జీతాలు ఇవ్వ‌డం లేద‌ని…అటివీ శాఖ అధికారే  ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మాట్లాడుతున్నార‌ని అక్క‌డ లేటైతే త‌న స్వంత ఖ‌ర్చులు పెట్టి మ‌రీ ఈ న‌ర్స‌రీలు,మ‌మ్ముల‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నార‌ని  న‌ర్స‌రీ నిర్వ‌హిస్తున్న రైతు ల‌క్ష్మీ పేర్కొంది.

ఇక చివ‌రిగా భోగాపురం వ‌ద్ద అట‌వీశాఖ సోష‌ల్ విభాగం న‌డుపుతున్న న‌ర్స‌రినీ చూసి జిల్లా కేంద్రానికి తిరుగుముఖం ప‌ట్టింది.న‌ర్స‌రీలు,మొక్క‌లపెంప‌కం మ‌క్కువ క‌లిగిన ఇలాంటి రైతుల ప‌ట్ట ప్ర‌భుత్వం జీతాలు ఇవ్వ‌కుండా ఎందుకింత నిర్ల‌క్ష్యం వహిస్తుందో.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

ఫర్ సేల్: కామారెడ్డి కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి

Satyam NEWS

సమంత లానే అరుదైన వ్యాధితో మమత

Satyam NEWS

సిఏఏ, ఆర్టికల్ 370 పై సౌదీలో ఇస్లామిక్ దేశాల మీటింగ్

Satyam NEWS

Leave a Comment