39.2 C
Hyderabad
April 16, 2024 18: 31 PM
Slider సంపాదకీయం

ఫారెస్టు డిస్ట్రాక్షన్: ఇక్కడ మొక్కల రక్షణ అక్కడ అడవుల భక్షణ

forest nallamala

ఆమ్రాబాద్ టైగర్ జోన్ ను ఛిద్రం చేస్తున్నారు. అయ్యో పాపం అని కూడా చూడకుండా అక్కడి నుంచి పులులను వెళ్లగొడుతున్నారు. చిన్న ప్రాణుల్ని చిదిమేస్తున్నారు. పర్యావరణాన్ని మగ్గబెడుతున్నారు. ప్రఖ్యాతి చెందిన ఆమ్రాబాద్ అభయారణ్యం అల్లాడిపోతున్నది.

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ టూరిజం అభివృద్ధి పేరుతో అక్కడి జీవులతో ఆడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ యురేనియం తవ్వకాలతో వణికి పోయిన నల్లమల అడవులు ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్లతో చిల్లులు పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే కు అందరితో మొక్కలు నాటించారు. నల్లమల అడవిని మాత్రం ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ మొక్కలు నాటుడు అక్కడ మొక్కలు పీకుడు. ఇదేం రాజ్యం?

నల్లమల అభయారణ్యంలోని ఆమ్రాబాద్ పులుల సంరక్షణ క్షేత్రంలోని డీప్ ఫారెస్ట్ లో సుప్రీం కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అటవీశాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో బోర్లు వేస్తున్నారు. డ్రిల్లింగ్ మిషన్ల శబ్దకాలుష్యంతో భయకంపితులవుతున్న వన్యప్రాణులు చెల్లా చెదురై స్థానభ్రంశం చెంది వేరే ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి.

 అడవిని నమ్ముకొని అనాదిగా జీవిస్తున్న చెంచులు యురేనియం కోసం అధికారులు, ప్రభుత్వం త్రవ్వకాలు జరుపుతున్నారని మాయ మాటలతో మమ్ములను మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు. అంతరించే దశకు చేరుకున్న పులులను కాపాడాలని వాటికి ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేసి రక్షించాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు నివేదించిన క్రమంలో పులుల అభయారణ్యంలో ఎటువంటి నూతన నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీం కోర్టు చెప్పింది.

 అయితే దీనిని బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ టైగర్ జోన్ లోని డీప్ ఫారెస్ట్ లో గల పరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద పర్యాటక అభివృద్ధిలో భాగంగా కాంటిలివర్ బ్రిడ్జి ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం ఫరహాబాద్ వద్ద 40 నుండి 60 ఫీట్ల లోతులో పదుల సంఖ్యలో బ్రిడ్జి పునాదుల కోసం బోర్లను ఈ నెల 10 వ తేదీన వేసింది. బోర్ల కారణంగా వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా అడవిలోని వన్యప్రాణులు, పెద్ద పులులు సైతం వాటి ప్రస్తుత స్థానాలను వదిలి దూరప్రాంతాలకు పరుగులు తీశాయి.

పెద్దపులి సహజ లక్షణం అది స్వేచ్ఛగా ఉండేందుకు అనువైన ఆవాసాన్ని నిర్దేశించుకుంటుంది. వేట, నీరు, స్వేచ్ఛ వంటి వాటికి అమిత ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో అడవిలో వేసిన బోర్ల కారణంగా అవి ప్రస్తుతం వేరే ప్రాంతాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడింది. కాపాడాల్సిన అటవీశాఖ కూడా అడ్డుచెప్పకపోవడం, ముందుండి బోర్లు వేయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపులుల పేరు చెప్పి అడవిలోకి చెంచులను కూడా అనుమతించకుండా ఆంక్షలు చెప్పే అధికారులు ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం పర్యావరణ ప్రేమికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ అభయారణ్యంలో అంతరించే దశకు చెందిన చెంచులు అనాదిగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి ముసుగులో మానవుడు చేసే పలు చర్యల కారణంగా అడవిలో ఉత్పత్తులు తగ్గి ఇప్పటికే చెంచు జాతి తగ్గిపోతుంది.

దీనికి తోడు అభివృద్ధి పేరుతో రక్షించాల్సిన ప్రభుత్వాలు సైతం అడవిని విచ్చల విడిగా నాశనం చేస్తున్నారు. యురేనియం అంటూ కొన్నాళ్ళు ఇబ్బందులు పెట్టగా, పర్యాటకం పేరుతో ఇప్పుడు వారి ఉనికికే ప్రమాదం తెస్తున్నారు. పర్యాటకులు నిరంతరం పర్యటించడం మూలంగా ప్లాస్టిక్ అడవిలో పెరిగి వన్యప్రాణులకు ప్రమాదం వాటిల్లుతుంది. దీని కారణంగా నష్టమే తప్ప లాభం లేదని కొందరు వాదించగా ప్రభుత్వం మోసం చేసి మళ్లీ యురేనియం కోసం అన్వేషణ జరుపుతున్నారని కొందరు వారిస్తున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి పేరుతో అంతరించే దశలో ఉన్న పులులను, చెంచులను రక్షించాల్సిన ప్రభుత్వాలు మరింత నాశనం చేస్తున్నారని వెంటనే వీటిని ఆపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ఎన్టీఆర్ పేరు కొనసాగించాలంటూ 5 వేల మంది సంతకాలు

Satyam NEWS

మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

దక్షిణ భారత దేశానికి మండస్ తుపాను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment